
శ్రీమన్నారాయణుడికి చందనోత్సవం
రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని శ్రీ చతుర్భుజ లక్ష్మీతాయారు సమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయం(చినగోపురంలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి చందనోత్సవం నిర్వహించారు. ఉదయం సహస్రనామ పూజలు, అలంకార తిరుమంజనం, సుప్రభాతసేవ, స్వస్తివాచకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి వారిని పట్టణ పురవీధుల్లో రథంపై ఊరేగించారు. సోమవారం వసంతోత్సవం, ధ్రువ మూర్తుల తిరుమంజనం, మహా పూర్ణాహుతి, ఏడు ముసుగుల ఉత్సవ కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ ఈవో బిరుదుకోట శంకర్ తెలిపారు. కార్యక్రమాలను ఆలయ ఈవో గుబ్బల రామ పెద్దింట్లరావు, బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు మాజేటి రాంబాబు, మామిడి బాబు, రేపాక ప్రవీణ్‌భాను, మాజేటి సూర్యభవానీ, మాచేపల్లి నాగఅన్నపూర్ణ, రేపాక సుబ్బారావు, దేవత భాస్కరరావు, నున్న కోటేశ్వరరావు, తదితరులు పర్యవేక్షిస్తున్నారు.