
అలరించిన నాటిక పోటీలు
ఉద్యాన పంటల సాగుపై శ్రద్ధ
ఉద్యాన పంటల సాగుపై వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో అధికారులు, రైతులతో ఏపీఎంఐపీ పీడీ, ఉద్యాన శాఖ జేడీ సమీక్షించారు. 8లో u
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంబికా సంస్థల వ్యవస్థాపకుడు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు మంగళవారంతో ముగిశాయి. నాలుగో రోజు కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన జనరల్ బోగీలు, రెండో ప్రదర్శనగా వీరన్నపాలెం కళానికేతన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన రుతువు లేని కాలం నాటికలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అద్భుతమైన కథాంశాలతో నటీనటుల హృద్యమైన నటనతో నాటికలు రక్తికట్టించాయి. అంబికా సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. వైఎంహెచ్‌ఏ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కేవీ సత్యనారాయణ, ఎగ్జి క్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.