
కొనసాగుతున్న గిరిజనుల దీక్షలు
బుట్టాయగూడెం: షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం కొండరెడ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పట్ల రమేష్‌కుమార్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, ఏటీఏ రాష్ట్ర గౌరవ సలహాదారు తెల్లం రాములు, జేఏసీ నాయ కులు కుంజా వెంకటేశ్వరరావు, సోదెం ముక్క య్య, రవ్వా బసవరాజు, తదితరులు నిరాహార దీక్షలో కుర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేరే వరకూ దీక్షలు కొనసాగుతాయని చెప్పారు. జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో పరీక్షలకు 7,707 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయని, వీటి కోసం 11 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.