
పారదర్శకంగా పోలీస్ బదిలీలు
91 మంది ఏఎస్సై, హెచ్‌సీలకు స్థానచలనం
ఏలూరు టౌన్: జిల్లా పోలీస్ శాఖలోని ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా చేపట్టారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లకుపైగా సేవలందిస్తున్న 91 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. 30 మంది ఏఎస్సైల్లో 29 మందికి, 65 మంది హెడ్ కానిస్టేబుళ్లలో 62 మందికి బదిలీలు అయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బదిలీ అయిన సిబ్బంది కొత్త స్టేషన్ల పరిధిలో కుటుంబంతో నివాసం ఉండాలని, ఇది వారి కుటుంబ జీవితం, విధి నిర్వహణకు సమతుల్యత ఇచ్చే అవకాశం కల్పిస్తుందన్నారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఐటీ కోర్ ఇన్‌చార్జి నరేంద్ర, శ్రీరామ్, ఆంజనేయ రాజు పాల్గొన్నారు.