
ఆలయాల్లో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఈఓ మానికల రాంబాబు, ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, కుమారాచార్యులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. జస్టీస్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయనకు అర్చకులు వేదాశీర్వాదం అందజేసి స్వామి వారి చిత్రపటం, శేషవస్త్రాలు అందించారు. జంగారెడ్డిగూడెం సివిల్ జడ్జి సీహెచ్ కిషోర్‌కుమార్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రాజేశ్వరి తేజస్వి, భీమడోలు మెజిస్ట్రేట్ ఎస్.ప్రియదర్శిని ఉన్నారు.
మద్దిలో.. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈఓ ఆర్‌వీ చందన మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక పూజకు ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తి దంపతులకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
నారసింహుని సేవలో..
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.