
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్ ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. దీంతో అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. స్వామికి గుడివాడకు చెందిన వన్నెంరెడ్డి మధుసూదనరావు కుటుంబసభ్యుడు దినేష్ వెండి పుష్పమాలను అందజేశారు.