
ఏలూరు జిల్లాలో భారీ వర్షం
కై కలూరు:ఏలూరు జిల్లాలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో అత్యధికంగా 81.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లాలో 444.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదవగా.. సరాసరి వర్షపాతం 16.08 మిల్లీమీటర్లుగా నమోదైంది. ముదినేపల్లి మండలంలో 80.4 మి.మీ, మండవల్లి మండలంలో 72.4 మి.మీ, కై కలూరు మండలంలో 51.6 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు కై కలూరు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. టౌన్‌హాలు, హైవే, రైల్వే స్టేషన్ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాలలో వర్షపు నీరు చేరింది.
ఆక్వా రంగం హడల్ : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురిస్తే చేపల చెరువుల్లో ఆక్సిజన్ సమస్య ఉత్నన్నమవుతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా చేపలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆక్సిజన్ సమస్య కారణంగా ప్రతీ ఏటా రూ. కోట్లలో ఆక్వా రైతులు నష్టపోతున్నారు.
జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదు