
ముగిసిన జిల్లాస్థాయి చదరంగం పోటీలు
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని ప్రతిభ స్కూల్ నందు శ్రీ హంస చెస్ అకాడమీ, ఏలూరు జిల్లా అడ్‌హక్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్ 11 బాల బాలికల చదరంగ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో యడ్ల జ్యోతి స్వరూప్, కుకునూరి తశ్విన్, బాలికల విభాగంలో యడ్ల ప్రేమ్ రక్షిత, వేగేశ్న ఇషిత సాయిశ్రీ విజేతలుగా నిలిచినట్లు టోర్నమెంట్ డైరెక్టర్ కన్నా సూర్య నాగేశ్వరరావు తెలిపారు. విజేతలు ఈ నెల 24, 25 తేదీల్లో గుంటూరులో జరిగే అండర్ 11 స్టేట్ చెస్ చాంపియన్ షిప్‌కి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ప్రతిభ స్కూల్ ప్రిన్సిపాల్ సరోజ రెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అయినపర్తి చంద్రశేఖర్, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీబీఎస్‌ఈ ఫలితాల్లో
భారతీయ విద్యాభవన్స్ ప్రతిభ
భీమవరం: సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాల్లో భారతీయ విద్యా భవన్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని భవన్స్ చైర్మన్ ఉద్ధరాజు కాశీ విశ్వనాధరాజు, సెక్రటరీ ఎస్ శ్రీరామరాజు చెప్పారు. టెన్త్ పరీక్షల్లో సీహెచ్‌ఎంవీ శ్రీకార్తిక్ 488 మార్కులు, ఆర్ సాయిశ్రీరామ్ 482, ఎస్ కీర్తన 482, సాయి పి పాండ 471 మార్కులు సాధించారన్నారు. సీబీఎస్‌ఈ +2 (ఇంటర్)లో కె హంసిక 477 మార్కులతో జిల్లాలో ప్రథమస్థానంలో నిలవగా వీఎల్ చెక్రిష్ 459, ఎ ఆదర్శ్ 456, జి ప్రణీత్ వర్మ 410, చిరాగ్ అగర్వాల్ 407, కె ధర్మతేజ 394 మార్కులు సాధించినట్లు చెప్పారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్వంలో నడుస్తున్న భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం స్కూల్స్‌లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. బుధవారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సభలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను భవన్స్ యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్, ఎం.సత్యనారాయణమూర్తి, రఘుపతిరాజు, ప్రిన్సిపాల్ సురేష్ బాలకృష్ణన్, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, పవన్, కంతేటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన జిల్లాస్థాయి చదరంగం పోటీలు