
అప్రమత్తత.. ముందస్తు భద్రత
ఏలూరు టౌన్: జిల్లావ్యాప్తంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో వా హన తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో పుణ్యక్షేత్రాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే కూడళ్లలో పోలీసులు ఆదివారం సా యంత్రం సోదాలు నిర్వహించారు. ఏలూరు, జంగా రెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్ డివి జన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరిగా యి. ముఖ్యంగా ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రం వద్ద, ప్రధాన రహదారుల్లో పోలీస్ అధికారులు డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. అక్రమ చొర బాట్లు, మద్యం, గంజాయి, డ్రగ్స్, పేలుడు పదార్థాలు, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, అసాంఘిక శక్తులను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ శివకిషోర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు దేశంలోకి చొరబడి బాంబు పేలుళ్లు వంటివి చేసే ప్రమాదం ఉండటంతో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలనీ, ప్రజల భద్రత దృష్ట్యా నిత్యం నిఘాను మరింత పెంచామని జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

అప్రమత్తత.. ముందస్తు భద్రత