
నాణ్యతతో అర్జీలు పరిష్కరించాలి
ఏలూరు (మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 258 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రా థీమ్ కార్యక్రమంపై విస్తృతంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
నెలలుగా వేతనాలు బంద్
ఎంపీటీసీలకు గత 20 నెలలుగా ఎలాంటి వేతనాలు ఇవ్వడం లేదని భీమడోలు మండల ఎంపీటీసీలు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసారు. తక్షణం బకాయి ఉన్న గౌరవ వేతనాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు కోరారు.
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించే కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇళ్ల నిర్మాణాలు, ప్రగతిపై కలెక్టరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయకపోవడంతో కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా 788 ఇళ్ల రూఫ్ కాస్ట్ పూర్తి చేయాలన్నారు. రూఫ్ లెవెల్‌లో ఉన్న ఇళ్లకు వారం రోజుల్లో స్లాబులు వేయించాలన్నారు. 20