
రుణాలకు సిఫార్సులు సరికాదు
ఎమ్మెల్సీ రవీంద్రనాథ్
సిఫార్సులతో రుణాలు మంజూరు చేయడం సరి కాదని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అన్నారు. డీఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులకు కార్పొరేషన్ రుణాలు అందితే వారు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. అయితే ఇటీవల బీసీ రుణాలను ఎమ్మెల్యే ల సిఫార్సులతో మంజూరు చేశారని, ఇది మంచి పాలన కాదన్నారు. అలాగే గత ప్ర భుత్వ హయాంలో పాఠశాల ల అభివృద్ధి, నూతన భవన నిర్మాణాల కోసం నిధులు కేటాయించారని, సెకండ్ ఫేజ్‌లో స్కూల్ భవనాల నిర్మాణాలు ఆగిపోయా యన్నారు. ఆగిపోయిన భవన నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని కోరారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలుకు కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతు లు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సమస్య రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.