
మూల్యాంకనం.. సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఇంటర్మీడియెడ్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గతంలో ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వేర్వేరుగా మూల్యాంకనం జరగ్గా ప్రస్తుతం పేపర్లు తక్కువగా ఉండటంతో ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి తొలి విడత మూల్యాంకనం ప్రారంభం కానుండగా ఈనెల 21 నుంచి రెండో విడత ప్రారంభం అవుతుంది. ఈనెల 31న మూల్యాంకనం ముగియనుంది.
81,469 పేపర్లు
ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు అన్ని సబ్జెక్టులు కలిపి జిల్లాకు 81,469 పేపర్లు వచ్చాయి. వీటిలో సంస్కృతం 5,249, తెలుగు 1,821, హిందీ 39, ఇంగ్లిష్ 12,830, గణితం–ఏ 13,424, గణితం–బీ 12,727 పేపర్లు ఉన్నాయి. అలాగే సివిక్స్ 3,152, బోటనీ 2,276, జువాలజీ 3,185, హిస్టరీ 335, ఫిజిక్స్ 9,797, ఎకనామిక్స్ 3,668, కెమిస్ట్రీ 10,683, కామర్స్ 2,283 పేపర్లు వచ్చాయి. మొత్తం 81,469 పేపర్లలో ప్రథమ సంవత్సరం జవాబుపత్రాలు 71,423, ద్వితీయ సంవత్సరం జవాబుపత్రాలు 10,046 ఉన్నాయి. ఈ మేరకు ఎగ్జామినర్లకు విధులు కేటాయించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి మొత్తం 1,348 మంది ఎగ్జామినర్లను విధులకు నియమించారు.
ఎగ్జామినర్ల నియామకం
సబ్జెక్టు ఎగ్జామినర్లు
ఇంగ్లిష్ 124
గణితం 205
సివిక్స్ 57
తెలుగు 79
హిందీ 11
సంస్కృతం 66
ఫిజిక్స్ 203
ఎకనామిక్స్ 87
కెమిస్ట్రీ 211
హిస్టరీ 31
బోటనీ 88
జువాలజీకి 96
కామర్స్ 90
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ వాల్యూయేషన్
జిల్లాకు వచ్చిన 81,469 జవాబుపత్రాలు
13,48 మంది ఎగ్జామినర్ల నియామకం