
ఏలూరులో దంచికొట్టిన వాన
ఏలూరు (టూటౌన్): ఏలూరులో శనివారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ప్రధానంగా ప్రభుత్వాస్పత్రి మెయిన్ రోడ్డు, ఎన్‌ఆర్‌పేట రైల్వే ట్రాక్ రోడ్డు, పవర్‌పేట ట్రాక్ రోడ్డు, జిల్లా పరిషత్ రోడ్లలో వర్షం నీరు భారీగా చేరడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. పవర్‌పేటలోని స్నేహా వారధిలోకి వర్షం నీరు చేరడంతో ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఫుట్‌పాత్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో ఎన్‌ఆర్‌పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి స్నేహా వారధి వరకు సుమారు అర కిలోమీటరు వరకు మామిడి వ్యాపారులు పండ్లు తడవకుండా, కొట్టుకుపోకుండా కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వాస్పత్రి ఆవరణ, జిల్లాపరిషత్ కార్యాలయ ఆవరణ, ఇండోర్ స్టేడియం లోపల వర్షం నీరు చేరింది. పలు ప్రాంతాల్లో మురుగునీరు పొంగి పొర్లి రోడ్లపైకి చేరింది.

ఏలూరులో దంచికొట్టిన వాన

ఏలూరులో దంచికొట్టిన వాన