అభయాంజనేయస్వామికి మల్లెపూలతో పూజ | - | Sakshi
Sakshi News home page

అభయాంజనేయస్వామికి మల్లెపూలతో పూజ

May 19 2025 7:26 AM | Updated on May 19 2025 7:26 AM

అభయాం

అభయాంజనేయస్వామికి మల్లెపూలతో పూజ

పెదపాడు: అప్పనవీడులోని అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం మల్లెపూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు భజన మండలిచే సంప్రదాయ సంకీర్తనలు నిర్వహించారు. సాయంత్రం విజయదుర్గ కోలాట బృందంచే కోలాటం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజ, నక్షత్ర హారతి నిర్వహించారు. శ్రీ విజయదుర్గా నాట్యమండలి బృందం సత్యహరిశ్చంద్ర కాటి సీను ప్రదర్శించింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 30న భైరవం సినిమా రిలీజ్‌ పురస్కరించుకుని అభయాంజనేయస్వామి ఆలయంలో సినీ నటులు మంచు మనోజ్‌, నారా రోహిత్‌, విజయ్‌ కనకమేడల, కేకే రాధామోహన్‌ స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదాశీర్వాదం అందించారు.

అభయాంజనేయస్వామికి మల్లెపూలతో పూజ 1
1/1

అభయాంజనేయస్వామికి మల్లెపూలతో పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement