వేసవిలో వాహనాలు జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

వేసవిలో వాహనాలు జాగ్రత్త

May 17 2025 6:32 AM | Updated on May 17 2025 6:32 AM

వేసవి

వేసవిలో వాహనాలు జాగ్రత్త

బైక్‌లు, కార్ల నిర్వహణలో మెకానిక్‌ల సూచనలు

పాలకొల్లు సెంట్రల్‌ : వేసవిలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతల వల్ల వాహనాల రంగు మారిపోవడం, టైర్లలో గాలి తగ్గిపోవడం, పెట్రోలు ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బైక్‌ మెకానిక్‌లు వేసవిలో బైక్‌ల రక్షణకు పలు సూచనలు చేస్తున్నారు.

నీడలో పార్కింగ్‌ మేలు

● వాహనాలను ఎక్కువ సమయం పార్కింగ్‌ చేయాల్సి వస్తే నీడ ఉన్న చోట చేయడం మేలు. ఎండ వేడికి వాహనాలు రంగు మారిపోయే అవకాశాలు ఎక్కువ.

● అధిక వేడి వల్ల టైర్లలో గాలి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తప్పని సరిగా వారానికోసారి టైర్లలో గాలిని తనిఖీ చేయించుకోవాలి. టైర్లలో గాలి తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.

● గాలి తక్కువగా ఉండడం వల్ల టైర్లు దెబ్బతింటాయి. ఎక్కువ గాలి ఉన్నా.. ఎండ వేడికి రన్నింగ్‌లో టైరు పేలిపోయే ప్రమాదాలు ఉంటాయి.

● ఎక్కువ సమయం వాహనం ఎండలో ఉండడం వల్ల పెట్రోల్‌ ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. వాహనాల్లో పగలంతా తిరిగి ఇంటికి చేరుకుంటాం. ఆ సమయాల్లో పెట్రోల్‌ ట్యాంక్‌ మూతను ఓ పది నిమిషాలు తీసి ఉంచితే మేలు. ట్యాంకులో కొంతవరకూ గ్యాస్‌ స్టోరయ్యే పరిస్థితి ఉంటుంది. మూత తీసి ఉంచితే గ్యాస్‌ బయటకు పోతుంది. వేసవిలో ఆయిల్‌ను సాయంత్రం కొట్టించడం మేలు.

● దూర ప్రయాణం చేసేటప్పుడు.. వాహనాలు ఎక్కువ వేడెక్కుతాయి. కొంతదూరం ప్రయాణం చేశాక ఇంజన్‌ ఆపి కొద్దిసేపు సేద తీరడం మంచిది.

వేసవిలో ఫుల్‌ ట్యాంక్‌ వద్దు

బైక్‌లు కొందరు ఫుల్‌ ట్యాంక్‌ చేయించుకునే అలవాటు ఉంటుంది. వేసవిలో ఫుల్‌ ట్యాంక్‌ చేయించకుండా ఉంటే మేలు. వాహనాన్ని పార్కింగ్‌ చేసే సమయంలో తప్పనిసరిగా నీడ ప్రాంతాన్ని చూసుకోవాలి. వేడికి పెట్రోల్‌ ఆవిరవ్వడమే కాకుండా రంగు మారే అవకాశాలు, గాలి తగ్గడం వంటివి జరుగుతాయి.

వర్ధినీడి ఉమా, బైక్‌ మెకానిక్‌, పాలకొల్లు

ఆగి ప్రయాణం చేయడం ఉత్తమం

రేడియేటర్లలో నీళ్లు లేకపోవడం వల్ల ఇంజిన్‌ వేడెక్కి వైరింగ్‌ షార్టయ్యే ప్రమాదం ఉంటుంది. వేసవిలో సుమారు 200 కి.మీ దూరం ప్రయాణం చేసిన అనంతరం ఎక్కడైనా వాహనాన్ని పార్కింగ్‌ చేసుకుని ఇంజిన్‌ కూల్‌ అయ్యాక మళ్లీ ప్రయాణం చేయడం ఉత్తమం. వాహనం హీట్‌ ఉన్నప్పుడు టైర్లు వెడెక్కుతాయి. వాటిపై నీళ్లు వేస్తే టైర్‌పై ఎయిర్‌ బబుల్స్‌ వచ్చి టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

– పడమటి సూరిబాబు, లారీ యజమాని, పాలకొల్లు

కార్లు, భారీ వాహనాల విషయంలో జాగ్రత్తలు

కార్లు, లారీలు, ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీటి శాతం తరచూ చూసుకోవాలి. రేడియేటర్లలో నీళ్ల కంటే కూలెంట్‌ ఆయిల్‌ వాడడం మంచిది.

వాహనాల్లో ఇంజన్‌ ఆయిల్‌ శాతం తరచూ చూసుకోవాలి.

వేసవిలో సాధ్యమైనంత వరకూ సీఎన్‌జీ వాహనాల్లో ప్రయాణం తగ్గించుకుంటే మంచిది. ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్‌ మ్యాట్స్‌ ఏర్పాటు చేసుకోవాలి.

భారీ వాహనాలకు కొత్త టైర్లు వాడితే ఉత్తమం. దూర ప్రాంతాలకు ప్రయాణం సమయంలో పాత టైర్లు వేడెక్కి గాలి తగ్గిపోతుంది. పేలిపోవడం వంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.

వేసవిలో వాహనాలు జాగ్రత్త 1
1/3

వేసవిలో వాహనాలు జాగ్రత్త

వేసవిలో వాహనాలు జాగ్రత్త 2
2/3

వేసవిలో వాహనాలు జాగ్రత్త

వేసవిలో వాహనాలు జాగ్రత్త 3
3/3

వేసవిలో వాహనాలు జాగ్రత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement