
నాటుసారా అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
ముసునూరు: నాటుసారా విక్రయిస్తున్నారనే సమాచారంతో స్పెషల్ స్క్వాడ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ వైవీఎన్‌ఎస్ ఫణికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి ఒకరిని అరెస్టు చేశారు. మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు. మండలంలోని రమణక్కపేట–అక్కిరెడ్డిగూడెం సరిహద్దులో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం బృందం వాహన తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో నూజివీడు మండలం మిట్టగూడెంకు చెందిన పోలగంటి చంటిని అదుపులోకి తీసుకుని, 30 లీటర్ల నాటుసారా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సారా సరఫరా చేస్తున్న రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట గ్రామానికి చెందిన భరోతు కుమార్‌పై కేసు నమోదు చేశామన్నారు.