
పెద్దింట్లమ్మా... చల్లంగా చూడమ్మా..
కై కలూరు: అమ్మా పెదింట్లమ్మా.. నీ చల్లనీ దీవెనలు మాకు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మను భక్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు చేసి అమ్మవారికి భక్తులు వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాయ దర్శనాలు, కేశఖండనశాల, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు విక్రయం, భక్తుల విరాళాల ద్వారా రూ.78,001 ఆదాయం వచ్చిందని తెలిపారు.

పెద్దింట్లమ్మా... చల్లంగా చూడమ్మా..