
పోలవరంలో భారీ చోరీ
పోలవరం రూరల్: పోలవరంలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం గ్రామానికి చెందిన పద్మనాభుని శ్రీనివాసు గుప్త ఐరన్ వ్యాపారి. మంగళవారం ఉదయం ఆయన భార్యతో కలిసి రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చి తాళాలు తీసి చూడగా, బీరువా తాళాలు బద్ధలు కొట్టి ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బాల సురేష్‌బాబు పరిశీలించారు. అలాగే చుట్టుపక్కల వారిని విచారించారు. డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్‌తో పరిశీలించారు. గుర్తు తెలియని దుండగుడు ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు గుండా ప్రవేశించి బీరువాలోని లాకర్ తాళాలు బద్ధలు కొట్టి 25 కాసుల బంగారం, నాలుగు కేజీల వెండి, రూ.8.60 లక్షల నగదును అపహరించినట్లు పోలవరం ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
25 కాసుల బంగారం, నాలుగు కేజీల వెండి, రూ. 8.60 లక్షల నగదు అపహరణ