
చటాకాయిలో ఉద్రిక్తత
కై కలూరు: చేపల చెరువుల వాటా డబ్బుల పంపిణీ వివాదం చటాకాయి గ్రామంలో ముదిరిపాకాన ప డింది. గ్రామంలో ఉమ్మడిగా సాగు చేస్తున్న 9 చెరువుల్లో వచ్చే ఆదాయం సమానంగా పంచడం లేదంటూ గ్రామస్తుల్లో కొందరు శనివారం ఏలూరు అటవీ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. గ్రామానికి ఆదాయాన్ని అందించే చెరువులను ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేసి పొక్లెయిన్లతో కొట్టేయడానికి ఓ వర్గం ప్రయత్నిస్తున్నారని మైక్‌లలో ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది. సర్పంచ్ ఘంటసాల శేషారావును గ్రామ కమ్యూనిటీ హాలు వద్ద వాటాల విషయంపై చర్చించుకోవడానికి పిలిచి ఓ వర్గం దాడి చేశారనే వార్త తెలియడంతో ఆయన కుమారుడు మరికొందరు అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో గ్రామంలో జయమంగళ లెవెన్‌రాజు, ఘంటసాల లక్ష్మయ్య, ఆయన కుమారుడు నాగరాజు, మోరు నాగేశ్వరరావులపై దాడి చేశారు. జయమంగళ సీతాలక్ష్మిపై దాడి చేయడంతో ఆమె మనస్తాపంతో ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. జరిగిన ఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై సైతం ఓ వర్గం వాదనకు దిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ, దాడికి గురైన వ్యక్తులను కై కలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని రూరల్ ఎస్సై రాంబాబు సిబ్బందితో చటాకాయి గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపుచేశారు. ఇరువర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు.
చెరువుల డబ్బుల పంపిణీలో వివాదం
సర్పంచ్ శేషారావుపై దాడి
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

చటాకాయిలో ఉద్రిక్తత