
భారీగా సెల్‌ఫోన్స్ రికవరీ
‘సింగిల్’ బృందం సందడి
సింగిల్ చిత్ర బృంద సభ్యులు మంగళవారం ఏలూరులో సందడి చేశారు. నగరంలోని ఎస్‌వీసీ థియేటర్‌లో ప్రేక్షకులను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. 8లో u
15వ విడతలో 594 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత
ఏలూరు టౌన్: జిల్లా పోలీసులు శ్రమించి వందలాది సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద రికవరీ చేసిన సెల్‌ఫోన్లు మంగళవారం ఎస్పీ చేతులమీదుగా బాధితులకు అందజేశారు. 15వ విడతలో 594 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వాటి విలువ మార్కెట్‌లో సుమారు రూ.71.28 లక్షలు ఉంటుందని అంచనా. ఏలూరు జిల్లాలో మొత్తంగా 15 విడతల్లో 2,976 మొబైల్ ఫోన్లు పోలీస్ అధికారులు రికవరీ చేశారు. ఈ సెల్‌ఫోన్ల విలువ ఏకంగా రూ.4.75 కోట్లు ఉంటుందని అంచనా.. ఈ సందర్భంగా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ... చోరీ వస్తువులు కొనడం, విక్రయించటం రెండూ నేరమేనని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఇళ్లు, షాపులు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని దుకాణ సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా నేరం జరిగితే నిందితులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయటంతోపాటు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సైబర్ నేరాల నిరోధానికి 1930కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్.జీవోవీ.ఇన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, బీ.ఆదిప్రసాద్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ రాజా, తదితరులు పాల్గొన్నారు.