మురళీ నాయక్‌కు నివాళి
కై కలూరు: పాకిస్థాన్ ముష్కరుల దాడిలో అసువులు బాసిన అమరవీరుడు మురళీనాయక్ త్యాగం ఎంతో గొప్పదని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. కై కలూరు పార్టీ కార్యాలయం వద్ద అమరవీరుడు చిత్రపటానికి మంగళవారం ఘన నివాళి అర్పించారు. డీఎన్నార్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడుతూ జమ్మూ కశ్మీర్‌లో అమరులైన అగ్ని వీర్ జవాన్ మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ బలే నాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ గాలిబ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


