అతిరుద్ర మహాయజ్ఞం.. సంపూర్ణం | - | Sakshi
Sakshi News home page

అతిరుద్ర మహాయజ్ఞం.. సంపూర్ణం

Dec 29 2025 8:05 AM | Updated on Dec 29 2025 8:05 AM

అతిరుద్ర మహాయజ్ఞం.. సంపూర్ణం

అతిరుద్ర మహాయజ్ఞం.. సంపూర్ణం

అతిరుద్ర మహాయజ్ఞం.. సంపూర్ణం

ఘనంగా ముగిసిన క్రతువు

నిడమర్రు: మందలపర్రు ఉమానీలకంఠేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞ కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుడు, యజ్ఞకర్త అక్కినప్రగడ శ్రీరాఘవేంద్ర సాయి శర్మ మాట్లాడుతూ స్వదేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యజ్ఞం చేపట్టామని, ఈ హో మాల నుంచి వచ్చే వాయువుతో గాలి మరింత స్వచ్ఛత సంచరించుకుంటుందన్నారు. అందుకు సంబంధించిన వాయుకాలుష్య నమోదు యంత్రాలు యాగశాలలో, గ్రామంలోని పలువురి నివాసాలపై ఏర్పాటు చేశామన్నారు. ఈ వారంలో రిపోర్టులు అందుతాయన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సుమారు 5 వేల మంది భక్తులు పాల్గొన్నారు. పూడిపెద్ది నరసింహశర్మ, వింజమూరి సత్యనారాయణమూర్తి శర్మ పర్యవేక్షణలో పండితులు యజ్ఞ పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement