ఎస్సై కొట్టాడని విషం తాగిన యువకుడు | nidamarru incident youth consumes poison over police harassment claim | Sakshi
Sakshi News home page

ఎస్సై కొట్టాడని విషం తాగిన యువకుడు

Apr 2 2026 8:01 AM | Updated on Apr 2 2026 8:01 AM

nidamarru incident youth consumes poison over police harassment claim

ఏలూరు జి­ల్లా: ఎస్సై కొట్టాడని ఓ యు­వకుడు పురుగు మందు తాగిన ఘ­టన ఏలూరు జి­ల్లా నిడమ­ర్రు­లో బుధ­వారం చోటు­చేసు­కుంది. స్థాని­కులు, పో­లీసులు తెలి­పి­న వివరాల ప్రకారం.. నిడమర్రుకు చెందిన నండూరి శివకార్తికేయ (33) తన మేనకోడలు బంగారు గొలుసుపోవడానికి అదే గ్రామానికి చెందిన వట్టి వేణుగోపాల్‌ కారణమని ఆరోపించడంతో గత నెల 29న ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. రెండువర్గాలు 30న నిడమర్రు పోలీస్‌­స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గా­లపై కేసులు నమో­దు కాగా.. మంగళ­వారం  నిడమర్రు బాలవెంకటేశ్వర­స్వామి కల్యాణోత్సవాల్లో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, పోలీసు సిబ్బందితో బాధితుడు శివకార్తికేయ వాగ్వాదానికి దిగాడు.

 తనపై కేసు నమోదు చేసి వేణు­గోపాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాడు. ఆ సందర్భంలో బాలాజీ అనే వ్యక్తి కత్తి తిప్పి పరారయ్యాడు. దీంతో శివ­కార్తికే­యను ఎస్సై జీపులో స్టేషన్‌కు తీసుకు­వెళ్లి చితక­బాదినట్టు శివకార్తికేయ కుటుంబ­సభ్యులు చెబుతున్నారు. శివకార్తికేయ మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని కుటుంబ సభ్యు­లు చెప్పగా రాత్రికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే కల్యా­ణోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్‌ కొట్టా­డని, విచారణ పేరుతో స్టేషన్‌­లోనూ కొట్టా­డని బాధితుడు శివకార్తికేయ బుధవారం పురుగు మందు తాగాడు. 

అతడిని తణుకులోని ప్రైవే­టు ఆస్పత్రికి తరలించారు. కాగా.. పోలీసుల దౌర్జన్యంతో శివకార్తికేయ ఆత్యహత్యకు పాల్పడ్డాడని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం శివకార్తికేయ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలి­పారు. దీంతో బుధవారం రాత్రి ఏలూరు డీ­ఎస్పీ శ్రావణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడు­తూ.. వాస్తవాలను తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి స్థానికుల నుంచి వివ­రాలు సేకరిస్తామని చెప్పారు. ఈ ఘటనలో తప్పు ఎవరిదో గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ వెంట నిడ­మర్రు సీఐ రజనీకుమార్, కైకలూరు రూరల్‌ సీఐ రవికుమార్‌ ఉన్నారు. 

nidamarru incident youth consumes poison over 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement