
మోటార్‌సైకిళ్లు ఢీకొని యువకుడి మృతి
పెనుగొండ: రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆచంట మండలం కోడేరు వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుగొండ మండలం దేవ శివారు తాళ్లపాలెంకు చెందిన గడ్డం సన్నిబాబు (18) సోమవారం తన అమ్మమ్మ ఊరు పాలకొల్లుకు వెళుతున్నాడు. కోడేరు నుంచి మోటారు సైకిల్‌పై ఆచంట వైపు వస్తున్నాడు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం లంకల గన్నవరం శివారు నడిగడి గ్రామానికి చెందిన యన్నాబత్తుల సత్యనారాయణ, అతని భార్య కృష్ణకుమారి ఇద్దరు మోటారు సైకిల్ పై ఆచంట నుంచి కోడేరు వెళుతున్నారు. ఈ రెండు మోటార్‌సైకిళ్లు కోడేరు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సన్నిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. యన్నాబత్తుల సత్యనారాయణకు, అతని భార్య కృష్ణకుమారికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సన్నిబాబు పెనుగొండ కళాశాలలో ఇంటర్ చదువుతూ ఇటీవల విడుదలైన ఫలితాలలో ఉత్తీర్ణత సాధించాడు. గత ఏడాది కాలంగా అతను చదువుకుంటూనే పాలకొల్లులో వీడియో ఎడిటింగ్ కూడా చేస్తున్నాడు.
మరో ఇద్దరికి గాయాలు