
యుద్ధప్రాతిపదికన సాగునీటి పనులు
ఏలూరు(మెట్రో): జిల్లాలో సాగునీటి వనరులకు సంబంధించిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇరిగేషన్ పూడికతీత పనులు, ఉపాధి హామీ, తాగునీరు సరఫరా, రెవెన్యూ, విద్య ఉద్యాన తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్‌కుమార్, మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు.
2.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో 2.50 లక్షల టన్నుల రబీ ధాన్యం సేకరణ పూర్తయ్యిందని మంత్రి మనోహర్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 20,225 మంది రైతుల నుంచి రూ.575 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఇప్పటికే రూ.486 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు.
ఇన్‌చార్జి మంత్రి మనోహర్