
సారా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
నూజివీడు: జిల్లాలో నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం నియోజకవర్గాల్లో సారా తయారీ అధికంగా ఉందని ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీ నాగప్రభు కుమార్ తెలిపారు. సారా నిర్మూలనకు నవోదయం–2 కింద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ నిరంతరం సారా బట్టీలపై దాడులు, ఎకై ్సజ్ పాత నేరస్తులను బైండోవర్ చేయడం, సారా తయారీ గ్రామాల్లో కమిటీలు వేసి సారా నిర్మూలనకు చర్యలు తీసుకున్నామన్నారు. నూజివీడు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 47 సారా తయారీ గ్రామాలను గుర్తించామన్నారు. ఆయా గ్రామాల్లో సారా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ మార్పు తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఎకై ్సజ్ పాత నేరస్తులు 317 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య ఉన్నారు.
కొబ్బరి చెట్టుపై పిడుగు
దెందులూరు: కొవ్వలి గ్రామంలోని రాజుల పేటలో ఉన్న కనకమ్మ ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై బుధవారం ఉదయం పిడుగు పడింది. ప్రశాంతంగా ఉండే పల్లెటూరులో ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో సమీప ఇళ్లలోని ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. కొబ్బరి చెట్టు కాయలు కాలిపోవడం తప్ప ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఇంటి యజమాని, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
భూసార పరీక్షలతో చేనుకు చేవ
ముసునూరు: భూసార పరీక్షలతో చేనుకు చేవ, రైతులు లాభం పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖాధికారి హబీబ్ బాషా సూచించారు. మండలంలోని సూరేపల్లిలో ఆర్‌ఎస్‌కే వద్ద బుధవారం మట్టి నమూనా సేకరించు విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి నమూనా సేకరణ, భూసార పరీక్షల వల్ల లాభాలను రైతులకు వివరించారు. మండలంలో 1200 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటికి 600 నమూనా సేకరణలు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె.చిన సూరిబాబు, ఏఈఓ రామకృష్ణ, వీహెచ్‌ఏలు, రైతులు పాల్గొన్నారు.

సారా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

సారా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు