
పెండ్లి కుమారుడిగా మీసాల వెంకన్నస్వామి
కై కలూరు: మీసాల వెంకన్న వార్షిక బ్రహోత్సవాలు కై కలూరులో అత్యంత వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచన, పంచామృత అభిషేకాలు చేశారు. స్వామివారిని పెండ్లికుమారుడు, అమ్మవారిని పెండికుమార్తెగా అలంకరించారు. సుదర్శన హోమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మాడ వీధులలో గజ వాహనంపై స్వామిని ఊరేగించారు. ఆలయ ఈవో వీఎన్‌కే.శేఖర్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి 7.10 గంటలకు స్వామి దివ్య కల్యాణం జరుగుతుందన్నారు.
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించున్నారు.

పెండ్లి కుమారుడిగా మీసాల వెంకన్నస్వామి