
హర్షిత కళాశాల గుర్తింపు రద్దు
ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాన్ వెల్లడి
కామవరపుకోట: ఏపీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిబంధనలు–1987 అతిక్రమించిన కారణంగా కామవరపుకోట మండలం తడికలపూడిలోని హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్షిత జూనియర్ కళాశాల గుర్తింపును 2025–26 విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కళాశాలను సందర్శించి కళా శాల సిబ్బందికి గుర్తింపు రద్దు విషయంపై నోటీసు అందజేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కళాశాల గుర్తింపు రద్దు చేసిన విషయాన్ని తెలియజేసేలా కరపత్రాన్ని కళాశాల నోటీస్ బోర్డులో అంటించారు. కళాశాల గుర్తింపు రద్దు చేసినందున ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎవరూ చేరవద్దని, అలాగే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీసీ తీసుకుని మరో కళాశాలలో చేరాలని ఆయన సూచించారు.