
వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు
బుట్టాయగూడెం : తరతరాల నుంచి వేప చెట్లుకు ఒక ప్రత్యేకత ఉంది. వేప చెట్టులో ప్రతి భాగం ఒక్కో విశిష్టత కలిగి ఉంటుంది. వేప చెట్టులోని భాగాలు వైద్యంతోపాటు వ్యవసాయ సాగులో, పంటల్లో చీడ పీడల నివారణలో ఎంతగాలో ఉపయోగపడతాయని వ్యవసాయాధికారులు చెబున్నారు. ప్రకృతిపరంగా లభించే వేపపిండి, వేప నూనె, కొమ్మలను సేంద్రీయ ఎరువుల పద్ధతిలో రైతులు వాడుతుంటారు. వేప పిండి, కొమ్మలు భూమిని సారవంతం చేయడంతో పాటు పంట దిగుబడి పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పలు రకాల వేప ఉత్పత్తులను వాటి ఉపయోగాలను వ్యవసాయాధికారులు రైతులకు ముందుగానే వివరిస్తున్నారు.
ప్రయోజనాలివీ
● వేప ఆకులు లేదా ఆకు కొనలు పొడి చేసి నిల్వ చేసి ధాన్యంలో కలిపితే పురుగులు పట్టవు.
● వేప ఆకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనుసంచులకు పురుగులు దరిచేరవు.
● ఎరువుగా వేపాకులు పొలంలో వేస్తే సేంద్రియ పదార్థం, పోషకాలతోపాటు నిరోధక శక్తి కలిసి వస్తాయి.
● వేప నూనె పంటలపై పిచికారీ చేస్తే కాయ తొలుచు పురుగు, రసం పీల్చు పురుగు, ఆకు తినే పురుగులను అదుపు చేయవచ్చు.
● ఒక లీటర్ వేప నూనెకు 200 లీటర్‌ల నీరు, 200 గ్రాముల సబ్బుపొడి(సర్ఫ్)ను కలిపి ద్రవణం తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎకరంలో స్ప్రేయింగ్ చెయ్యడానికి సరిపోతుంది. నూనె, నీరు కలువదు కనుక ముందుగా సబ్బుపొడి బాగా కలిపి నురగ వచ్చిన తర్వాత నీటిలో కలపాలి.
● వేప పిండి మేలైన చిక్కటి సేంద్రీయ ఎరువు. గింజ నుంచి తీసి వేసిన వేప పిండిలో 5.2 శాతం నత్రజని, 11 శాతం భాస్వరం, 1.5 శాతం పొటాషియం ఉంటుంది. ఇది ఎరువుగానే కాకుండా సస్య రక్షణకు ఉపయోగపడుతుంది.
పాడి–పంట
వేప నూనె, పిండితో పంటలకు రక్షణ
సేంద్రియ పద్ధతుల్లో వాడుతున్న రైతులు
వేప ఉత్పత్తులతో పర్యావరణ ప్రయోజనాలు
వ్యవసాయంలో వేప ఆధారిత ఉత్పత్తులను వినియోగించడం వల్ల అనేక పర్యావరణ ప్రయోజనాలు లభిస్తాయి. వేప జీవనాధారణ పొందుతుంది. పర్యావరణ వ్యవస్థలో పేరుకుపోదు. కాలుష్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేప నేల నాణ్యతను పెంచుతుంది. ఆరోగ్యకరమైన, స్థితి స్థూపక వ్యవసాయ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
– డి.ముత్యాలరావు, ఏఓ, బుట్టాయగూడెం

వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు

వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు

వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు