
కమనీయం.. శ్రీవారి కల్యాణం
నేత్రపర్వంగా చిన వెంకన్న కల్యాణోత్సవం
ద్వారకాతిరుమల: సర్వాభరణ భూషితుడైన శ్రీవా రు నుదుటున కల్యాణ తిలకం, బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న అమ్మవార్లను పెండ్లాడారు. ద్వా రకాతిరుమల చినవెంకన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ తూ ర్పు రాజగోపురం వద్ద కల్యాణ వేదికపైకి శ్రీవారు, అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో తీసుకువచ్చి రజిత సింహాసనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించి, పలు ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను జరిపించారు. దేవస్థానం తరఫున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు కుమారుడు నివృతరావు పట్టువస్త్రాలను సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పట్టువస్త్రాలను అందించారు. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిపిన వేడుక భక్తజనులను పరవశింపజేసింది. కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లు వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో భాగంగా స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు రథోత్సవం
ఆదివారం రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీవా రి ప్రత్యేక అలంకారం రాజమన్నార్.
దుర్గగుడి నుంచి పట్టువస్త్రాలు
చినవెంకన్న బ్రహ్మోత్సవాలకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వా రు పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి ఈ ఓ వీకే శీనానాయక్ దంపతులు పట్టువస్త్రాల ను ఇక్కడి ఈఓ సత్యనారాయణమూర్తి చేతులమీదుగా అర్చకులకు అందజేశారు.

కమనీయం.. శ్రీవారి కల్యాణం