గ్యాస్ లీకేజీకి పరిష్కారం
ఆగిరిపల్లి: స్థానిక యూనియన్ బ్యాంకు వద్ద గ్యాస్ లీకేజీ సమస్యను మేఘా గ్యాస్ సిబ్బంది పరిష్కరించారు. ఆదివారం ‘గ్యాస్ లీకేజ్‌తో ఇక్కట్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి సోమవారం మేఘా గ్యాస్ సిబ్బంది స్పందించారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేసి లీకేజీ సమస్యను పరిష్కరించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.
కవర్లు విక్రయిస్తే చర్యలు
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని శ్రీవారి దేవస్థానం సూపరింటెండెంట్ ఐవీ రామారావు వ్యాపారులను హెచ్చరించారు. ‘సాక్షి’ లో ‘అమలు కాని ప్లాస్టిక్ నిషేధం’ శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఆలయ తూర్పు ప్రాంతంలోని దేవస్థానం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. భక్తులకు కవర్లు ఇచ్చినా, విక్రయించినా, వినియోగించినా అపరాధ రుసుం విధిస్తామన్నారు.


