నేరాల అడ్డుకట్టలో విఫలం
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పోలీసులు ఈ ఏడాది నేరస్తులకు కఠిన శిక్షలు విధించేలా న్యాయవ్యవస్థతో సంయుక్తంగా చేపట్టిన చర్యలు బాగున్నా.. నేరాలను నిరోధించటంలో విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇళ్లు, బంగారు షాపుల్లో చోరీలు భారీగా జరిగాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి లక్షలు కాజేశారు. జూద శిబిరాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులు రక్తంతో తడిసాయి. ఏలూరు నగరంలో మావోయిస్టుల అరెస్టు సంచలనంగా మారింది. ఏడాదిలో జిల్లాలో ఏకంగా 32 హత్యలు జరిగాయి.
నెత్తురోడిన రహదారులు : ఏలూరు జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లన్నీ నెత్తురోడాయి. ఈ ఏడాది ఏకంగా 600 రోడ్డు ప్రమాదాలు జరిగితే... వాటిలో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జాతీయ రహదారి చొదిమెళ్ళ బ్రిడ్జి సమీపంలో లారీని వెనుకనుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా నలుగురు మృత్యువాత పడ్డారు. రత్నాస్ హోటల్ ప్రాంతంలో ఏడాదిలో 15 ప్రమాదాలు జరిగితే 8 మంది మృతి చెందారు. ఈ నెల 27న భీమడోలు బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరులో మావోయిస్టుల కలకలం
ఏలూరు నగరంలోని మినీ బైపాస్ సమీపంలో గ్రీన్ సిటీ ప్రాంతంలో ఒక ఇంట్లో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అప్రమత్తమయ్యారు. ఎస్పీ శివకిషోర్ రంగంలోకి దిగారు. 100 నుంచి 150 మందికి పైగా పోలీస్ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. డ్రోన్లతో సాంకేతిక నిపుణులు పర్యవేక్షణ చేస్తూ.. పోలీస్ యాక్షన్ టీం ఇంటిపై ఆకస్మిక దాడులు చేసింది. 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మావోయిస్ట్ కీలకనేత హిడ్మా అనుచరులుగా గుర్తించారు. భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
మద్యం మత్తులో ప్రాణాలు బలి
ఆర్‌ఆర్‌పేట రోడ్డులోని వైన్స్‌లో ఒక వ్యక్తి మద్యం తాగుతూ మృతిచెందాడు. ఏలూరు జిల్లాలో మద్యం ఏరులై పారిస్తున్నారు. నెలకు సగటున రూ.9.50 కోట్ల మద్యం వ్యాపారం జిల్లాలో సాగుతోంది. జిల్లాలో బెల్ట్ షాపులకు కొదవేలేదు. మద్యం దుకాణాలన్నీ పాలకపక్ష నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి.
ప్రమాదాలతో నెత్తురోడిన ప్రధాన రహదారులు
జిల్లాలో విచ్చలవిడిగా జూద శిబిరాలు
జనాలను వణికిస్తున్న సైబర్ నేరగాళ్లు
ఏలూరులో మావోయిస్టుల కలకలం
నేరాల అడ్డుకట్టలో విఫలం
నేరాల అడ్డుకట్టలో విఫలం


