రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..
ఏలూరు ఆర్‌ఆర్‌పేటకు చెందిన ఒక వృద్ధురాలు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.58 లక్షల నగదు కాజేశా రంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరాలను ఎస్పీ కొమ్మి శివకిషోర్ చాలెంజింగ్ తీసుకున్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో4 పోలీస్ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఏడు రాష్ట్రాల్లో 14 వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ జిల్లా పోలీసులు నేరగాళ్ల మూలాలను గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. 11మంది సైబర్ నేరగాళ్లను గుర్తించగా 8 మందిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఏలూరు జిల్లాలో ఈ ఏడాది సుమారు 263 చోరీ కేసులు నమోదు కాగా, పోలీస్ అధికారులు భారీగా రికవరీ చేశారు. అనేక కేసుల్లో నిందితులైన నలుగురు దొంగలను భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన విశాఖ వసంతను అరెస్ట్ చేసి 184.37 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కేటీఎం బైక్స్, ఇతర సొత్తుతో కలిపి మొత్తం రూ.35 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు పట్టణం, పరిసర ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను నూజివీడు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మోటారు సైకిళ్లను పోలీసులు రికవరీ చేశారు.


