
సీహెచ్‌ఓల గోడు పట్టని సర్కారు
ఏలూరు (టూటౌన్) : గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు వైద్యసేవలందించే సీహెచ్‌ఓలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్) గోడు కూ టమి ప్రభుత్వానికి పట్టడం లేదు. ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని కోరుతూ సీహెచ్‌ఓలు 22 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమ గోడు అరణ్య రోదనగా మారిందని, ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే వరకూ సమ్మె విరమించేది లేదని సీహెచ్‌ఓలు చెబుతున్నారు.
460 విలేజ్ క్లినిక్‌లు మూత
ఎంఎల్‌హెచ్‌సీ/సీహెచ్‌ఓలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో పాటు వారిపై అదనపు పనిభారం మోపుతుండటంతో గత నెల 15 నుంచి వీరు ఉద్యమ బాట పట్టా రు. గత నెల 27 వరకు పలు రకాలుగా నిరసనలు తెలిపినా పాలకుల్లో చలనం లేకపోవడంతో 28 నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 460 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు మూతపడ్డాయి.
జగన్ హయాంలో హెల్త్ క్లినిక్‌లు
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామాల్లోని సబ్ సెంటర్ల స్థానంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో సీహెచ్‌ఓతో పాటు ఒక ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త కొన్ని చోట్ల మేల్ హెల్త్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించేవారు. 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, 67 రకాల వైద్య పరికరాలను అప్పటి ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రత్యేక శిక్షణ పొదిన బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారు మిడ్ లెవిల్ హెల్త్ ప్రొవైడర్లు/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
విలేజ్ క్లినిక్‌లపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే విమర్శలు ఉన్నాయి. సీహెచ్‌ఓలకు జీతభత్యాల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఆరేళ్ల సర్వీసు పూర్తయిన సీహెచ్‌ఓల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. జీఓ.64 ప్రకారం ఎన్‌హెచ్‌ఎంలో అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉంది. అయితే 189 కేడర్లకు ఇచ్చి సీహెచ్‌ఓలకు మాత్రం ఇవ్వలేదు. అందరికీ పీఎఫ్ ఇస్తున్నా వీరికి మాత్రం ఇవ్వడం లేదు. ఏడాదిగా ఇన్సెంటివ్‌లు ఇవ్వడం లేదు. అలాగే సీహెచ్‌ఓలపై అదనపు పని భారాలను మోపుతున్నారు. వీరికి హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయడం లేదు. కనీసం చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అలుపెరుగని పోరాటం
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం
22 రోజులుగా సమ్మెలోనే..
మూతబడిన విలేజ్ క్లినిక్‌లు
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరం
పట్టించుకోని కూటమి సర్కారు
జిల్లాలో 460 హెల్త్ క్లినిక్‌లు
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆరేళ్లుగా సీహెచ్‌ఓలుగా పనిచేస్తున్న మాకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలి. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌లను తక్షణం విడుదల చేయాలి. రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు సేవ చేసే కోణంలోనే పాలకులు చూడాలి. అప్పుడే గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి.
– కురెళ్ల సురేంద్ర, సీహెచ్‌ఓల అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్, హెచ్‌డబ్ల్యూసీ, జి.కొత్తపల్లి
చర్చలకు పిలిచేంత వరకూ..
రాష్ట్రవ్యాప్తంగా సీహెచ్‌ఓలు గత నెల 15 నుంచి పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో గత్యంతరం లేక గత నెల 28 నుంచి సమ్మెలోకి వెళ్లాం. మా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచేంత వరకు మేమంతా సమ్మెను కొనసాగిస్తాం.
– సొంగా సిద్ధయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు, హెచ్‌డబ్ల్యూసీ, తెడ్లం
22 రోజులుగా సమ్మె చేస్తున్నా..
తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు, నిరసనలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు. గత నెలలో విజయవాడలో జరిగిన మహాధర్నాలో సీహెచ్‌ఓలంతా పాల్గొన్నాం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో శాంతియుతంగా సమ్మె చేపట్టాం. 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరం.
– ఎస్‌కే రేష్మా, కొయిదా, హెచ్‌డబ్ల్యూసీ, వేలేరుపాడు మండలం
సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలి
ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓలను తక్షణం క్రమబద్ధీకరించాల్సి ఉన్నా చేయడం లేదు. ఎన్‌హెచ్‌ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు తీర్చేలాహామీ ఇవ్వాలి. మా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.
– గెడ్డం లావణ్య, గోపన్నపాలెం, హెచ్‌డబ్యూసీ, దెందులూరు మండలం
గ్రామాల్లో స్తంభించిన వైద్యసేవలు
విలేజ్ క్లినిక్‌లు మూతపడటంతో గ్రామాల్లో వైద్యసేవలు స్తంభించాయి. చిన్నపాటి వైద్యానికీ దూరంగా ఉన్న పీహెచ్‌సీలకు వెళ్లాలి వస్తోంది.

సీహెచ్‌ఓల గోడు పట్టని సర్కారు

సీహెచ్‌ఓల గోడు పట్టని సర్కారు

సీహెచ్‌ఓల గోడు పట్టని సర్కారు

సీహెచ్‌ఓల గోడు పట్టని సర్కారు