
డెంగీపై అవగాహన తప్పనిసరి
ఏలూరు(మెట్రో): డెంగీ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ముద్రించిన బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, కనుగుడ్లు నొప్పులు డెంగీ లక్షణాలన్నారు. వ్యాధి లక్షణాలపై జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్య సిబ్బంది విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రతిఒక్కరూ డెంగీ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్‌ఓ ఆర్.మాలిని, డీఎంఓ పిఎస్‌ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.
స్వచ్ఛాంధ్ర విజయవంతానికి..
ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి