
పశ్చిమ గోదావరి: తనను ఆర్థికంగా మోసగించారన్న మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో భార్య మృతి చెందింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మాదు శ్రీనివాస్ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం భార్య సంధ్య (23) మృతి చెందడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు.
దగ్గర బంధువైన కిట్టుకు 20 ఏళ్ల క్రితం నగదు ఇచ్చాడని ఆ నగదుతో పొలం కొన్నారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం తాను అప్పుల్లో ఉన్నానని తన వాటాగా ఎంత వస్తే అంత ఇవ్వాలని శ్రీనివాస్ కిట్టును అడగ్గా.. ఇచ్చేది లేదని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. మేకా రామకృష్ణ (కిట్టు) వల్ల ఒక కుటుంబం నాశనమైందని బంధువులు ఆరోపించారు. ఈ చావుకు అతనిదే బాధ్యతని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు.