శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

May 17 2025 6:32 AM | Updated on May 21 2025 1:41 PM

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. న్యాయమూర్తి సుబ్బారెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి స్వామివారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్‌.ప్రియదర్శిని నూతక్కి ఉన్నారు.

లభ్యం కాని బాలుడి వివరాలు

ద్వారకాతిరుమల: స్థానిక యూనియన్‌ బ్యాంకు సమీపంలో ఈనెల 9న ఒంటరిగా తిరుగుతూ కనిపించిన ఐదేళ్ల బాలుడిని స్థాని కులు పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. బాలుడు తన పేరు గోపాల్‌ అని, తండ్రి పేరు నాయక్‌ అని మాత్రమే చెబుతు న్నాడు. అంతకు మించి వివరాలు చెప్పలేకపోవడంతో బాలుడిని ఏలూరులో జిల్లా శిశు గృహానికి తరలించి, తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్టు డీసీపీఓ సీహెచ్‌ సూర్య చక్రవేణి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బాలుడి వివరా లు తెలియలేదని, ఎవరికైనా తెలిస్తే సెల్‌ 94910 63810, లేదా ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ 94407 96653, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ రాజు 77027 48404 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.

సప్లిమెంటరీ పరీక్షలకు 4,445 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 4,445 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్‌ జనరల్‌ కేటగిరీలో 3,472 మందికి 3,227 మంది, ఒకేషనల్‌ కేటగిరీలో 478 మందికి 425 మంది హాజరయ్యారు. సెకండియర్‌ జనరల్‌ కేటగిరీలో 692 మందికి 637 మంది, ఒకేషనల్‌ కేటగిరీలో 174 మందికి 156 మంది హాజరయ్యారని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌ తెలిపారు.

పశ్చిమలో ప్రశాంతంగా..

భీమవరం: జిల్లాలోని 40 కేంద్రాల్లో జరిగిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 91 శాతం వి ద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియె ట్‌ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు తెలిపా రు. ఫస్టియర్‌ జనరల్‌ కేటగిరీలో 4,844 మందికి 4,477 మంది, ఒకేషనల్‌ కేటగిరీలో 645 మందికి 569 మంది హాజరయ్యారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement