
ఏలూరు, సాక్షి: ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోమటి గుంట చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి పెదవేగి మండలం వేగివాడకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు గల్లంతైన ఇద్దరు యువకులను సురక్షితంగా బయటకు తీశారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుల మరణంపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.