
సాక్షి, ఏలూరు జిల్లా: తన భర్త ఆరోగ్యం అసలు బాగోలేదని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. కిటోన్ శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చాయని తెలిపారు. బరువు కూడా తగ్గిపోయారని.. వంశీ ఆరోగ్యంపై తమకు తీవ్ర ఆందోళనగా ఉందని తెలిపారు. లాయర్ చిరంజీవి మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. పాత కేసులను తిరగదోడి కావాలనే ఇబ్బందిపెడుతున్నారన్నారు. పిటీ వారెంట్ దాఖలులో నిబంధనలు ఫాలో కాలేదని చిరంజీవి అన్నారు
వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు.. 14 రోజుల రిమాండ్‌ను విధించింది. హనుమాన్ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్‌తో వంశీకి రిమాండ్ విధించింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులతో అధికార కూటమి ప్రభుత్వం వేధింపుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆయనపై పలు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయటంతో గత 90 రోజులకుపైగా వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేసిన కేసుల్లో న్యాయస్థానం వరుసగా బెయిల్ మంజూరు చేయటంతో తాజాగా హనుమాన్‌జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో గురువారం పీటీ వారంట్ దాఖలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసును ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.
