
ఈదురు గాలుల బీభత్సం
ఎండలు మండుతున్న వేళ పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లో గురువారం భారీ వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పెనుగొండలో ఈదురుగాలులు, భారీ వర్షం భీభత్సం సృష్టించింది. పెనుగొండ, వడలి, వెంకట్రామపురం గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. మార్టేరు– పెనుమంట్ర స్టేట్‌హైవే రోడ్డుపై కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అయితే భారీ వర్షం నేపథ్యంలో రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవడానికి అవస్థలు పడ్డారు. – పెనుగొండ/పెనుమంట్ర

ఈదురు గాలుల బీభత్సం