
ఈఏపీ సెట్‌కు 941 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా ఇంజినీరింగ్ ప్రవేశాలకు గురువారం మూడు పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 976 మంది విద్యార్థులకు గాను 941 మంది హాజరయ్యారు. ఉదయం సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 160 మందికి 153 మంది, మధ్యాహ్నం 161 మందికి 152 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 148 మంది, మధ్యాహ్నం 150 మందికి 143 మంది హాజరు కాగా, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 171 మంది, మధ్యాహ్నం 178 మందికి 174 మంది హాజరయ్యారు.
మెడికల్ సర్టిఫికెట్లకు మరో అవకాశం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, రాజమండ్రి జిల్లాల పరిధిలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మెడికల్ సర్టిఫికెట్లు పొందడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖా ధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఏలూరులోని జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో నిర్వహించే ప్రత్యేక మెడికల్ క్యాంపునకు తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుందన్నారు. గతంలో ఏప్రిల్ 24 నుంచి 26 వరకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన ఉపాధ్యాయులకు మరో అవకాశం కల్పించినట్టు స్పష్టం చేశారు.
అర్హులైన వైద్యులనే సంపద్రించాలి
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు గర్భిణులు అర్హులైన వైద్యులనే సంప్రదించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జి.గీతాబాయి అన్నారు. గురువారం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు గర్భిణులకు ఆల్ట్రా సౌండ్ స్కౌనింగ్‌లు రిఫర్ చేయకూడదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందడం వల్ల మాతృ మరణాలు, శిశు మరణాలు నియంత్రించవచ్చన్నారు. 9 నెలల గర్భిణీ సమయంలో కనీసం రెండు సార్లు స్కానింగ్ తప్పనిసరని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్ హాస్పటల్ తణుకులో ఉచితంగా అల్ట్రా స్కానింగ్ చేస్తారన్నారు.
‘పది’ పరీక్షలకు 3,483 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పది సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం గణితం పరీక్షకు 4,799 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,483 మంది హాజరయ్యారు. 1,316 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్యావిధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఇంటర్ భౌతిక శాస్త్రం పరీక్షకు 142 మందికి 122 మంది హాజరు కాగా, రాజనీతి శాస్త్రం పరీక్షకు 133 మందికి 110 హాజరయ్యారు. పదో తరగతి గణితం పరీక్షకు 364 మంది విద్యార్థులకు 308 హాజరు కాగా 56 మంది గైర్హాజరయ్యారు.
76 శాతం హాజరు
భీమవరం: పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షాలో భాగంగా గురువారం నిర్వహించిన గణితం పరీక్షకు 76.87 శాతం విద్యార్థులు హాజరయ్యా రని డీఈవో ఇ.నారాయణ చెప్పారు. 3,856 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావల్సివుండగా 2,964 మంది హాజరయ్యారన్నారు. ఎస్‌ఎస్‌సీ(ఏపీఓఎస్‌ఎస్) పబ్లిక్ పరీక్షకు 378 మందికి 294 మంది విద్యా ర్థులు హాజరుకాగా ఇంటర్మీడియట్(ఏపీఓఎస్‌ఎస్) పరీక్షకు 620 మందికి 528 విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు.
పెనుమంట్ర పోలీస్ స్టేషన్ కార్యాలయం ప్రారంభం
పెనుమంట్ర: పెనుమంట్ర మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రీ మోడల్ చేసిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని గురువారం మధ్యాహ్నం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రారంభించారు. ఇంతవరకు పోలీస్ స్టేషన్ నిర్వహించిన విద్యా శాఖ భవనం శిధిలావస్థకు చేరడంతో మండల పరిషత్‌కు చెందిన పాత భవనాన్ని రీమోడల్ చేసి పోలీస్ స్టేషన్‌కు ఇచ్చారు. ఈ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, పెనుగొండ సీఐ ఆర్.విజయ్‌కుమార్, పెనుమంట్ర, పెనుగొండ, ఆచంట ఎస్సైలు కె.స్వామి, గంగాధర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.