
ఏజెన్సీలో భద్రత కట్టుదిట్టం
కుక్కునూరు: చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు, కీలక నేత నంబాల కేశవరావు మృతి చెందడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏజెన్సీలో కుక్కునూరు పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. గురువారం కుక్కునూరు మండల కేంద్రంలోని బ్యాంకుల్లో బాండ్ స్క్వాడ్ డిటెక్టర్లతో, పోలీస్ డాగ్‌లతో తనిఖీ చేశారు. కుక్కునూరు, బూర్గంపాడు ఆర్ అండ్ బీ రహదారిపై వచ్చిపోయే వాహనాలను పోలీస్ సిబ్బంది తనిఖీ చేశారు. కుక్కునూరు మండలం అటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉండడం, గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పోలవరంలో తనిఖీలు
పోలవరం రూరల్: పోలవరం మండలంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు పోలవరం ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

ఏజెన్సీలో భద్రత కట్టుదిట్టం