
భూముల కబ్జా యత్నంపై మహిళల నిరసన
భయాందోళనలో వైద్య సిబ్బంది
తణుకు ప్రభుత్వ ఆస్పత్రిలో రాత్రి వేళల్లో రోగులు, క్షతగాత్రుల కోసం వచ్చేవారు గొడవలు చేయడంపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. 10లో u
కొయ్యలగూడెం: పరింపూడి పంచాయతీ సర్వే నంబర్ 311/2 లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ ఆ ప్రాంత మహిళలు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సుమారు 40 ఏళ్ల నుంచి ఉంటున్న వందలాది కుటుంబాలకు చెందిన వారి స్థలాలను కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారి నుంచి రక్షణ కల్పించడంతోపాటు ఇప్పటికే ఉంటున్న వారికి స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తులకు ఆ సర్వే నంబర్ లోని భూములను కేటాయిస్తూ న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కె.చెల్లన్నదొరకు వినతి పత్రం సమర్పించారు.