
ఐరన్, సిమెంట్ బస్తాల చోరీ వాస్తవమే
దెందులూరు: జిల్లాలో పేదల గృహ నిర్మాణ కాలనీల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రి దొంగతనాలు, దుర్విని యోగం జరిగాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.సత్యనారాయణ చెప్పారు. బుధవారం ఏలూరులో తన కార్యాలయంలో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందిచారు. దెందులూరు గృహ నిర్మాణ శాఖ గొడౌన్ నుంచి స్టీల్ దొంగతనం జరిగిందని, నూజివీడు గోడౌన్‌లో డోర్స్, కిటికీలు, స్టీల్, ఎలక్ట్రికల్ సామాన్లు చోరీకి గురయ్యాయాన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసు ఫిర్యాదు చేశామన్నారు. గత సంవత్సరం ఆడిట్‌లో పెదవేగి, అగిరిపల్లి మండలాల్లో ఇళ్లనిర్మాణ సామాగ్రి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామన్నారు.

ఐరన్, సిమెంట్ బస్తాల చోరీ వాస్తవమే