నాటు తుపాకులతో హల్‌చల్
ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు వేటగాళ్లు నాటు తుపాకులు విచ్చలవిడిగా వాడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 8లో u
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద సోమవారం నిరసన నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్య పరిరక్షణ కోసం యూటీఎఫ్ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, జీవో 117ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని రద్దుకు ఎలాంటి ప్రత్యామ్నాయ జీవోను రిలీజ్ చేయకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ మాట్లాడుతూ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో ఈనెల 25వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ నెర్సు రామారావు పాల్గొని జేఏసి తరుపున మద్దతు ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి ప్రారంభ ఉపన్యాసం చేశారు.


