బాధ్యతతో అర్జీలు పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టరు ఎం.జె.అభిషేక్ గౌడ నిర్వహించారు. రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ దరఖాస్తుల పరిష్కారంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి వారం వారం ప్రత్యేక రివ్యూ చేస్తున్నారని తెలిపారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులతో చిరునవ్వుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఫిర్యాదుదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలన్నారు.
అంగన్‌వాడీలను ఈఎస్‌ఐలో చేర్చాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని అంగన్‌వాడీలందరినీ ఈఎస్‌ఐ పథకంలో చేర్చాలని ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్– హెల్పర్స్ యూనియన్(ఇఫ్టూ) జాయింట్ కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించింది.


