అటకెక్కిన సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

అటకెక్కిన సంక్షేమం

Dec 30 2025 7:42 AM | Updated on Dec 30 2025 7:42 AM

అటకెక

అటకెక్కిన సంక్షేమం

వేతనాలు పెరగక వెతలు సర్పంచ్‌పై దాడి.. కేసు నమోదు సోషల్‌ మీడియాతో అప్రమత్తం ఉండాలి విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి మోదెలు గ్రామానికి సౌర విద్యుత్‌ దివ్యాంగులకు మూడో శుక్రవారం గ్రీవెన్స్‌ డే మావుళ్లమ్మ మూల విరాట్‌ దర్శనం పునః ప్రారంభం

గిరిజనులపై దాడులు దుర్మార్గం

గత ప్రభుత్వంలో 75 శాతం కుటుంబాలకు ప్రయోజనం

న్యూస్‌రీల్‌

సంక్షేమ పథకాల ఊసే లేదు

మహిళలకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు

రుణాలు లేక చిరు వ్యాపారాలు వెలవెల

వేతనాలు పెరగక వెతలు
ట్రిపుల్‌ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8లో u

మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

పెదపాడు: సర్పంచ్‌పై దాడి కేసులో పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పెదపాడు పోలీసుల వివరాల ప్రకారం పెదపాడు మండలంలోని ఏపూరు సర్పంచ్‌ చోడగిరి రామకృష్ణ నూజివీడులోని దేవరగుట్ట నుంచి ఏపూరుకు వస్తుండగా పెదపాడు మండలంలోని ఏపూరు శ్రీలక్ష్మీరైస్‌ మిల్‌ వద్ద పెదకడిమికి చెందిన కొసరాజు వంశీకృష్ణ, మట్టా వినయ్‌లు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి, కొఠారు అబ్బయ్యచౌదరిల ఫొటోలు చూసి ఆపి బూతులు తిట్టి, కిందపడేసి కొట్టి, చంపుతామని బెదిరించినట్లు రామకృష్ణ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరు టౌన్‌: సోషల్‌ మీడియాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి జయశర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం ఉందని, ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు సోషల్‌మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ నేరగాళ్ళు అనేక రకాలుగా మోసాలు చేస్తూ డబ్బులు కాజేస్తారని తెలిపారు. సైబర్‌ నేరాలపై వెంటనే 1930కు సమాచారం అందించి, ఫిర్యాదు చేయాలన్నారు.

ఏలూరు(మెట్రో): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి, నూరుశాతం ఉతీర్ణత సాదించేందుకు రూపొందించిన 100 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 100 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉతీర్ణత సాధన దిశగా చేపట్టిన ప్రణాళిక విజయవంతంగా అమలు చేసి విద్యాభివృద్ధిలో ఏలూరు జిల్లాను ముందు వరసలో నిలిపి ఉత్తమ ఫలితాల సాధనకు కృషిచేసిన వారిని సన్మానించి గౌరవిస్తామని కలెక్టర్‌ చెప్పారు.

వేలేరుపాడు: విద్యుత్‌ వెలుగులకు నోచుకోని గిరిజన గ్రామం మోదెలు గ్రామం విషయంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించి, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ముందుగా గ్రామంలోని 23 ఇళ్లకు విద్యుత్‌ అందించేందుకు రూ.12.5 లక్షలతో గ్రిడ్‌ ఏర్పాటుచేసి ప్రతి ఇంటికీ సౌర విద్యుత్‌ను అందించారు. తమకు విద్యుత్‌ వెలుగులు అందించిన జిల్లా యంత్రాంగాన్ని కలిసి గ్రామస్తులు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జె.అభిషేక్‌ గౌడ, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సాల్మన్‌ రాజును ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

భీమవరం(ప్రకాశం చౌక్‌): దివ్యాంగులకు ప్రతినెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రతి నెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్‌ డే ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యలను మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్‌్స్‌ డే రోజున అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. విజువల్లీ చాలెంజ్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు.

ఏలూరు (టూటౌన్‌): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు పరవళ్లు తొక్కాయి. మహిళలే మహరాణులుగా వెలుగొందారు. ప్రతి ఇంట్లో ఏటా దాదాపు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరింది. వ్యాపారాల కోసం ఇతరుల వద్దకు అప్పు కోసం పరుగులు తీయకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయం ప్రజలకు అక్కరకు వచ్చింది. దానికి భిన్నంగా ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని సంక్షేమ పథకాలను అటకెక్కించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సంక్షేమం వెలవెలబోయింది. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జీవన విధానంలో కష్టాల కడగళ్లు ప్రారంభమయ్యాయి. నాటి ప్రభుత్వ హయాంలో ప్రధాన పండుగల రోజుల్లో ప్రజల అవసరాలు తీర్చేలా ప్రభుత్వం ఏదో ఒక పథకం రూపంలో ఆర్థిక సహాకారం అందించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో నాడు లబ్ధి పొందిన ప్రజలు నేడు ఉసూరుమంటున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లాలోని 1,75,118 మంది విద్యార్థులకు రూ.450.77 కోట్లు విద్యాదీవెన ద్వారా అందజేశారు. జగనన్న వసతి దీవెన పథకంలో 1,73,246 మంది విద్యార్థులకు రూ.171.38 కోట్లు అందజేసారు. ఈ రెండు పథకాల్లో ఇంత వరకు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది తప్ప క్షేత్ర స్థాయిలో విడుదల చేయలేదు.

వృత్తిదారులకు అందని చేదోడు

వైఎస్సార్‌సీపీ పాలనలో చేదోడు పథకంలో ఏటా రూ.10 వేలు చొప్పున వరుసగా నాలుగేళ్లు అందజేసారు. నాలుగు విడతల్లో 53,999 మందికి దాదాపుగా రూ.54 కోట్ల మేర అందించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించింది. ఎన్నికల ముందు వృత్తిదారులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం మర్చిపోయింది.

డ్వాక్రా మహిళలకు షాక్‌

నాటి ప్రభుత్వంలో డ్వాక్రా మహిళా రుణాలు పూర్తిగా రద్దుచేసి నాలుగు విడతల్లో ఆ మొత్తాన్ని ఆసరా కార్యక్రమం పేరుతో క్రమం తప్పకుండా అందించేవారు. ప్రతి డ్వాక్రా మహిళకు ఏటా రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు లబ్ధి చేకూరింది. దీంతో మహిళల జీవితాల్లో వెలుగులు నిండాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా మహిళలకు ఎలాంటి నూతన పథకాన్ని ప్రారంభించకపోవడంతో మహిళలు మళ్ళీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆసరా పథకంలో 39,539 గ్రూపులకు చెందిన 3,89,801 మందికి రూ.1,448.41 కోట్ల మేరకు ఆర్థికంగా లబ్ది చేకూరింది.

భీమవరం (ప్రకాశం చౌక్‌): మావుళ్లమ్మ వారి 62వ వార్షికోత్సవం సందర్భంగా అలంకరణ పనుల కోసం ఈ నెల 17న మూల విరాట్‌ దర్శనాన్ని నిలిపివేశారు. అలంకరణ పనులు పూర్తి చేయడంతో సోమవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ కళాన్యాసం ప్రత్యేక పూజలను నిర్వహించగా అమ్మవారి మూల విరాట్‌ పునః దర్శనం భక్తులకు కల్పించారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలన్నారు.

కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం ఉచిత బస్సు ఎక్కుతున్న భక్తులు

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామివారి దర్శనం భక్తులకు కల్పించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆలయ పరిసరాలను, ఉత్తర ద్వారాన్ని సోమవారం రాత్రి పచ్చిపూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్తర ద్వారంలో స్వామివారు ఆసీనులయ్యే ప్రాంతాన్ని అలంకరించి, ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. అర్ధరాత్రి వరకు ఈ పనులు సాగాయి. స్వామివారి వాహన సేవకు వెండి గరుడ, శేష వాహనాలను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి నిజరూపంలో ఉన్న శ్రీవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.

క్షేత్రానికి చేరుకున్న దీక్షాధారులు

తొలి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి గోవింద స్వాములు సోమవారం రాత్రి ఆలయానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం స్వామిని దర్శించిన తరువాత ఇరుముడులు సమర్పించనున్నారు.

రెండు వాహనాలపై.. ముక్కోటి పర్వదినాన స్వామి వారు ఉత్తర ద్వారం వద్ద ఉదయం 10 గంటల వరకు వెండి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత అదే వాహనంపై గ్రామోత్సవానికి వెళతారు. ఆ సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లు వెండి శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే సాయంత్రం వరకు స్వామివారు గర్భాలయంలో నిజరూప దర్శనంలో భక్తులను కటాక్షిస్తారు.

గిరిజనులపై దాడులు దుర్మార్గమని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. గిరిజనులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 8లో u

గత ప్రభుత్వం హయాంలో జిల్లాలో దాదాపుగా 5 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా వీరిలో 75 శాతం కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. జిల్లాలోని మెజార్టీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. చిన్నాచితకా అవసరాలకు మగవారిపై ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు. గత 18 నెలల చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు చెల్లు చీటీ ఇవ్వడంతో క్రమంగా మహిళల ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తుంది. కూటమి పార్టీల కల్లబొల్లి మాటలు, అబద్దపు హామీలు నమ్మి మోసపోయామని జిల్లాలోని మహిళలు అంటున్నారు.

ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాల ఊసే ఎత్తడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కాపు నేస్తం, చేయూత, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, సున్నా వడ్డీ వంటి పథకాలు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నిలిచిపోయాయి. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకంలో మొదటి నాలుగు విడతల్లో ఏటా రూ.15 వేల చొప్పున ఏలూరు జిల్లాలో 66,488 మందికి రూ.99.73 కోట్లు అందించారు. వైఎస్సార్‌ చేయూత పథకంలో నాలుగు విడతల్లో ఏటా రూ.18,750 చొప్పున 2,76,653 మందికి రూ.518.72 కోట్లు అందించారు. ఈబీసీ నేస్తం పథకంలో వెనుకబడిన అగ్రవర్ణ పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున అందించారు. నేతన్న నేస్తం పథకంలో సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి ఒకే విడతలో రూ.24 వేల ఆర్థిక సాయం అందించారు.

విద్యార్థులకు అందని వసతి దీవెన, విద్యా దీవెన సాయం

రీయింబర్స్‌మెంట్‌ది అదే పరిస్థితి

చేదోడు, జగనన్న తోడు పథకాలకు మంగళం

బ్యాంకు రుణాలు అంతంత మాత్రమే

ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలు కనుమరుగు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా ఇంటికి రూ.లక్ష వరకు లబ్ధి

గత ప్రభుత్వ హయాంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రికార్డు స్థాయిల్లో డ్వాక్రా రుణాలను బ్యాంకుల ద్వారా అందజేశారు. రెండు జిల్లాల పరిధిలో నాలుగున్నరేళ్లల్లో మొత్తం రూ.11,336.53 కోట్లు రుణాలుగా ఇచ్చారు. ఏలూరు జిల్లా పరిధిలో 1,32,707 గ్రూపులకు రూ.6,428.88 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 99,393 గ్రూపులకు రూ.4,907.70 కోట్లు రుణాలు అందించారు.

గత ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల మందికి పింఛన్లు అందించే వారు. ఇప్పుడు జిల్లాలో 2.59 లక్షల మందికే పింఛన్లు అందిస్తున్నారు. దాదాపు ఆరు వేల పింఛన్లకు మంగళం పాడేశారు. ఫింఛన్లలో అనర్హులు ఉన్నారని వీటిని మరింత కుదించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో 10 వేల మంది పింఛన్లు తీసేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకంలో రూ.10 వేలు ఆర్థిక సాయం అందించేవారు. పెట్టుబడుల కోసం చిరు వ్యాపారులు ప్రైవేటు అప్పులు చేసే పనిలేకుండా నేరుగా బ్యాంకుల ద్వారానే రుణాలు ఇచ్చేవారు. నెలనెలా కొద్దిగా రుణం చెల్లించే వెసులుబాటు కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించింది. మహిళలకు చిరు వ్యాపారాలు, గొర్రెల, మేకల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇతర కుటీర పరిశ్రమలు పెట్టుకునేందుకు గతంలో రుణాలను అందించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కన్పించడం లేదు.

నేడు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామి దర్శనం

రెండు వాహనాలపై దర్శనమివ్వనున్న శ్రీవారు

ముందు రోజు రాత్రే వేలాదిగా ఆలయానికి చేరుకున్న భక్తులు

అటకెక్కిన సంక్షేమం1
1/7

అటకెక్కిన సంక్షేమం

అటకెక్కిన సంక్షేమం2
2/7

అటకెక్కిన సంక్షేమం

అటకెక్కిన సంక్షేమం3
3/7

అటకెక్కిన సంక్షేమం

అటకెక్కిన సంక్షేమం4
4/7

అటకెక్కిన సంక్షేమం

అటకెక్కిన సంక్షేమం5
5/7

అటకెక్కిన సంక్షేమం

అటకెక్కిన సంక్షేమం6
6/7

అటకెక్కిన సంక్షేమం

అటకెక్కిన సంక్షేమం7
7/7

అటకెక్కిన సంక్షేమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement