
అధికారుల నుంచి స్పందన లేదు
నిబంధనల ప్రకారం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో టీచర్లకు ఏడాదికి 12 నెలల జీతం ఇవ్వాల్సి ఉండగా చాలా విద్యాసంస్థలు 10 నెలలు మాత్రమే వేతనాలు ఇస్తున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందన లేదు. చాలా స్కూళ్లలో విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నా దానికి తగినట్టుగా టీచర్లకు వేతనాలు చెల్లించడం లేదు. విద్యాహక్కు చట్టప్రకారం ఏ విద్యాసంస్థా క్యాంపెయినింగ్ రూపంలో, ప్రకటనల రూపంలో, ప్రచారాల రూపంలో పబ్లిసిటీ చేయకూడదు. అయితే వీటిని విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా పబ్లిసిటీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిన్నా అధికారులకు పట్టడం లేదు.
– దిద్దే అంబేడ్కర్, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు
జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు టీచర్లు, లెక్చరర్లను వేసవి సెలవుల్లో వీధులు వెంట తిప్పుతూ అడ్మిషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్లు చేయని ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించడం, లేదా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్లే తమ సొంత డబ్బులను ఫీజుగా చెల్లించి అడ్మిషన్లు చేయించాల్సిన దుస్థితి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అడ్మిషన్లతో సంబంధం లేకుండా సిబ్బందికి ఏడాదికి 12 నెలల జీతం యాజమాన్యాలు చెల్లించాల్సిందిగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– టి.ప్రేమ్‌కుమార్, పీటీఎల్‌యూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు
●

అధికారుల నుంచి స్పందన లేదు