
డీఈఓ కార్యాలయ ముట్టడికి సన్నాహాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియలో ప్రభు త్వ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 21న డీఈఓ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం ఏలూరులో ఉపాధ్యాయ సంఘాలు సన్నాహక సమావేశం నిర్వహించాయి. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కులను కాలరాయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈనెల 21న నిర్వహించే డీఈఓ కా ర్యాలయ ముట్టడి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌టీయూ నాయకుడు ఎం. శామ్యూల్, కేఆర్ పవన్ కుమార్, యూటీఎఫ్ నా యకులు జీవీ రంగమోహన్, ఎస్‌కే అలీ, వైఎస్సార్ టీఏ నాయకులు జి.సాంబశివరావు, వి.రామ్మోహన్, ఏపీటీఎఫ్ 1938, పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్ 257, ఏపీటీఏ, పీడీ, పీఈటీ సంఘ, ఆర్‌యూపీపీ నాయకులు పాల్గొన్నారు.