
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు
భీమవరం: దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం గునుపూడిలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ స భ్యులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన మోషన్‌రాజు ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించా రు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోషేన్‌రాజు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగం దిక్సూచిగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏక త్వంగా ప్రజలందరినీ సమానంగా చూసేదే రాజ్యాంగం అన్నారు. ప్రతి ఇంట్లో పవిత్ర గ్రంథాలతోపాటు రాజ్యాంగం కూడా ఉండాలన్నా రు. అంబేడ్కర్‌ను రాజ్యాంగానికి మాత్రమే పరిమితం చేయకూడదని, ఆయన జీవితంలో చేసిన ఎన్నో సాంఘిక, రాజకీయ పోరాటాలు ఉ న్నాయని గుర్తుచేశారు. అంబేడ్కర్ నాటక ప్రదర్శన అద్భుతంగా ఉందని, అకాడమీ సభ్యులు ఈ నాటకాన్ని గ్రామాల్లో కూడా ప్రదర్శించాలని కోరారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడు తూ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఈ కళారూప నాటక ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నరసాపురం ఆర్డీఓ దాసి రాజు రూ.50 వేల ప్రోత్సాహకాన్ని మోషేన్‌రాజు చేతులమీదుగా కళాకారులకు అందించారు.